ఎయిడెడ్ విద్యాసంస్థలపై జీవోలు ఉపసంహరించుకోవాలని కోరుతూ.. సీఎం జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. విద్యార్థి సంఘాల ఆందోళనతోనే రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్న ఆయన.. 4 ఆప్షన్లతో మెమో ఇచ్చిందని పేర్కొన్నారు.
RAMAKRISHNA: ఆ జీవోలు ఉపసంహరించుకోవాలి: సీపీఐ
ఎయిడెడ్ విద్యాసంస్థలపై సర్కారు జారీచేసిన జీవోలను ఉపసంహరించుకోవాలని.. సీఎం జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. అలాగే.. ఎయిడెడ్ విద్యా సంస్థలను గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద నడిపేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
'ఎయిడెడ్ విద్యాసంస్థలపై జీవోలు ఉపసంహరించుకోవాలి'
అయితే.. ఈ మెమో వల్ల విద్యార్థులకు, యాజమాన్యాలకు మధ్య వివాదం తలెత్తే పరిస్థితి ఉందని అన్నారు. విద్యాసంస్థల విలీన ప్రక్రియ వల్ల.. పేద, మధ్య తరగతి వర్గాల విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని అన్నారు. ఎయిడెడ్ విద్యా సంస్థలను గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద నడిపేందుకు, తగిన నిధులు, స్టాఫ్‌ను కేటాయించాలని, ఈ మేరకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:PADAYATRA: అమరావతి రైతుల మహా పాదయాత్రకు నేడు విరామం.. కారణమేంటంటే..?