ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని పులివెందులగా మార్చారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. హైదరాబాద్ మగ్ధుం భవన్లో మాడ్లాడిన ఆయన.. పోలీసులు, అధికారుల అండతో వైకాపా నేతలు దౌర్జన్యానికి పాల్పడుతున్నారన్న ఆయన.. ప్రత్యర్థి పార్టీల వారిని నామినేషన్లు కూడా వేయనీయడం లేదని మండిపడ్డారు. ప్రత్యర్థి పార్టీలు గెలిచే చోట అధికారులను అడ్డుపెట్టుకుని నామినేషన్లు చెల్లవని చెప్పించారని వాపోయారు. ఎన్నికలు జరిగితే ప్రత్యర్థి పార్టీ ఒక్క స్థానం కూడా గెలవదా అని రామకృష్ణ ప్రశ్నించారు. విపక్ష పార్టీల నేతలు రాష్ట్రంలో పర్యటించకూడదా అని నిలదీశారు.
సీఎం జగన్ రాష్ట్రాన్ని మరో పులివెందులగా మార్చారు: రామకృష్ణ - cpi state secratary ramakrishna fires on cm jagan
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలీసులు, అధికారుల తీరును సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తప్పుబట్టారు. వైకాపా శ్రేణులు పోలీసుల అండతో దౌర్జన్యానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రత్యర్థి పార్టీల వారిని నామినేషన్లు వేయకుండా అడ్డుపడ్డారని ధ్వజమెత్తారు. సీఎం జగన్ రాష్ట్రాన్ని మరో పులివెందులగా మర్చారని ఆయన ఆరోపించారు.
సీఎం జగన్ రాష్ట్రాన్ని మరో పులివెందులగా మార్చారు: రామకృష్ణ
Last Updated : Mar 15, 2020, 5:41 PM IST