రాష్ట్రప్రభుత్వ కక్ష పూరిత చర్యలు, నిరంకుశ విధానాలు తగవన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఏపీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ నియామక అర్హత నిబంధనలు మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడాన్ని తప్పుబట్టారు. కరోనా విపత్తు ముందే గ్రహించిన ఎన్నికల కమిషనర్ ఎన్నికలు వాయిదా వేశారని గుర్తు చేశారు. నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్న ఎన్నికల కమిషనర్ తమకు అనుకూలంగా లేకపోవడంతోనే వైకాపా ప్రభుత్వం ఆయనపై కక్షగట్టి ఆర్డినెన్సు తీసుకొచ్చిందన్నారు. ఎస్ఈసీని మార్చే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉందని... స్థానిక ఎన్నికల్లో వైకాపా అరాచకాలు బయటపడతాయనే రమేశ్ కుమార్‌కు ఉద్వాసన పలికారని అన్నారు. ఏపీలో స్థానిక ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎన్నికల కమిషనర్‌గా రమేశ్ కుమార్‌నే కొనసాగించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
తొలగింపు సరికాదు