రాజధానిపై మంత్రి బొత్స ఇటీవల చేసిన వ్యాఖ్యలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తప్పుబట్టారు. బొత్స తీరు గందరగోళాన్ని సృష్టిస్తోందని విజయవాడలో విమర్శించారు. రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగుతుందని అసెంబ్లీలో చెప్పి...మళ్లీ రాజధానిపై నియమించిన కమిటీ నివేదిక రావాలని అనడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఈ నెల 28న రాజధాని పరిధిలోని తుళ్లూరు వేదికగా రైతులు, కూలీలతో కలిసి సదస్సు నిర్వహిస్తున్నామని చెప్పారు. కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తామన్నారు.
"రాజధానిపై కమిటీ నివేదిక రావాలని చెప్పడమేంటి?" - cpi ramakrsihna reaction on bosta comments news
రాజధానిపై మంత్రి బొత్స వ్యాఖ్యలు గందరగోళంగా ఉన్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ విమర్శించారు.
cpi-ramakrsihna-reaction-on-bosta-comments-on-capital-city