ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CPI Ramakrishna: ఖాళీగా ఉన్న ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలి: సీపీఐ రామకృష్ణ - సీపీఐ రామకృష్ణ

ఉద్యోగ క్యాలెండర్​పై త్వరలోనే భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ(CPI Ramakrishna). రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

cpi ramakrishna
cpi ramakrishna

By

Published : Jun 28, 2021, 3:41 PM IST

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ (CPI Ramakrishna) డిమాండ్ చేశారు. ఉద్యోగాల భర్తీ కోసం ఆందోళనకు దిగిన నిరుద్యోగ యువతను అరెస్టులు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. విజయవాడలో మాట్లాడిన ఆయన.. ఉద్యోగ క్యాలెండర్​ (job calender) పై త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.

పోలవరం ప్రాజెక్టు (polavaram project) నిర్వాసితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని రామకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. నష్టపరిహారం ఇవ్వకుండా ఖాళీ చేయమని చెప్పడం దారుణమన్నారు. జులై 2, 3 తేదీల్లో పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తామని చెప్పారు. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న ప్రాజెక్టు వివాదాలపై ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చించుకోవాలని సూచించారు. ఈ అంశంలో కేంద్రం కూడా జోక్యం చేసుకోవాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details