ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'వారికీ రూ. 10 వేలు ఆర్థిక సాయం చేయండి' - సీఎం జగన్​కు సీపీఐ రామకృష్ణ లేఖ

మత్స్యకారులకు రూ. 10 వేల ఆర్థిక సాయం అందిస్తుందన్నందుకు ప్రభుత్వానికి సీపీఐ నేత రామకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. అలానే నెలన్నర నుంచి పనుల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న కూలీలు, ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు, భవన నిర్మాణ కార్మికులకూ పది వేల చొప్పున ఇవ్వాలని కోరారు.

సీపీఐ నేత రామకృష్ణ
సీపీఐ నేత రామకృష్ణ

By

Published : May 6, 2020, 11:33 AM IST

సీఎం జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. మత్స్యకార భరోసా కింద రూ.10 వేలు ఇస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. కరోనా వల్ల నెలన్నరగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.

కూలీలు, ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు, భవన నిర్మాణ కార్మికులు, వృత్తి పనివారు పనుల్లేక ఉపాధి లభించక పస్తులుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి కూడా రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం చేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details