ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రాష్ట్రంలో నాసిరకం ఇసుక... ఇతర్రాష్ట్రాలకు మేలిరకం' - cpi ramakrishna written letter to cm jagan on sand issue

రాష్ట్రంలో ఇసుక మాఫియా అక్రమాలు అరికట్టాలని... ముఖ్యమంత్రి జగన్​కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. రాష్ట్రంలో నాసిరకం ఇసుక సరఫరా జరుగుతోందని... మేలిరకం ఇసుక ఇతర రాష్ట్రాలకు తరలిపోతోందని లేఖలో పేర్కొన్నారు.

cpi ramakrishna written a letter to cm jagan on sand mafia
ఇసుక మాఫియాపై సీఎంకు సీపీఐ రామకృష్ణ లేఖ

By

Published : Jun 3, 2020, 9:43 AM IST

రాష్ట్రంలో ఇసుక మాఫియా అక్రమాలు అరికట్టాలని... సీఎం జగన్​కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా అక్రమాలు సాగుతూనే ఉన్నాయని... ఇసుక అక్రమాలపై వైకాపా ఎమ్మెల్యే మాట్లాడారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. నూతన విధానమంటూ ఐదు నెలలపాటు ఇసుక సరఫరా చేయలేదని అన్నారు. మేలిరకం ఇసుక ఇతర రాష్ట్రాలకు తరలిపోతోందన్నారు.

రాష్ట్రంలో నాసిరకం ఇసుక సరఫరా జరుగుతోందని... భవన నిర్మాణ కార్మికులకు పనులు కొరవడే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. సామాన్యులకు అందుబాటులో ఉండేలా ఇసుక ధరలు తగ్గించాలని లేఖలో పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details