ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'సీఎం జగన్... రైతు వ్యతిరేకిగా చరిత్రలో నిలిచిపోతారు' - cpi ramakrishna latest news

అమరావతి రైతులకు వ్యతిరేకంగా న్యాయస్థానంలో వాదించటానికి రూ.5 కోట్లు వెచ్చించడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తప్పుబట్టారు. లాయర్​ రుసుముపై కొత్త జీవోను తీసుకొచ్చి ప్రజాధనాన్ని కాపాడాలని డిమాండ్​ చేశారు.

cpi ramakrishna talks about lawyers fee
'రైతు వ్యతిరేకిగా ముఖ్యమంత్రి చరిత్రలో నిలిచిపోతారు'

By

Published : Jan 23, 2020, 7:53 PM IST

Updated : Jan 23, 2020, 8:39 PM IST

'సీఎం జగన్... రైతు వ్యతిరేకిగా చరిత్రలో నిలిచిపోతారు'

రాజధాని రైతులకు వ్యతిరేకంగా వాదించటానికి రూ.5 కోట్లు ఖర్చు పెట్టేవారు రైతు ప్రక్షపాతి ఎలా అవుతారని... సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతున్నా... అమరావతి అభివృద్ధికి రూ.5 కోట్లు వెచ్చించలేదని పేర్కొన్నారు. ప్రజాధనాన్ని లాయర్​ ఫీజు కింద చెల్లించటం దుర్మార్గమని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్​మోహన్​రెడ్డి రైతు వ్యతిరేకిగా చరిత్రలో నిలిచిపోవడం ఖాయమన్నారు. తన కేసులు వాదించే లాయర్​నే... ఈ కేసులు వాదించేందుకు పెట్టుకోవడం వెనక క్విడ్​ప్రోకో ఏమైనా ఉందా..? అని నిలదీశారు. న్యాయవాది ముకుల్​ రోహత్గి నైతిక విలువలు ఉంటే ఫీజు కింద తీసుకున్న ప్రజాధనాన్ని తిరిగి ఇవ్వాలన్నారు.

Last Updated : Jan 23, 2020, 8:39 PM IST

ABOUT THE AUTHOR

...view details