కరోనాను ఎదుర్కొనేందుకు ప్రధాని ప్రకటించిన ప్యాకేజీని పెంచాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. వైరస్ నియంత్రణకు 21 రోజుల లాక్‌డౌన్ ప్రకటించడంపై స్పందించారు. కూలీలు, పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజానీకానికి ఇది గడ్డుకాలమని అభిప్రాయపడ్డారు. ప్రధాని ప్రకటించిన రూ.15 వేల కోట్లు ప్యాకేజీ ఏమాత్రం ప్రజల అవసరాలు తీర్చేందుకు సరిపోదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీని సైతం పెంచాలని విజ్ఞప్తి చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా ప్యాకేజీ పెంచాలి: సీపీఐ - కరోనా లేటెస్ట్ న్యూస్
కరోనా వ్యాధి నిరోధానికి ప్రధాని మోదీ ప్రకటించిన రూ.15 వేల కోట్ల ప్యాకేజీని ఇంకా పెంచాలని సీపీఐ నేత రామకృష్ణ సూచించారు. సమస్యను సమర్థంగా ఎదుర్కొవాలంటే ఈ నిధులు సరిపోవని అభిప్రాయపడ్డారు.
సీపీఐ నేత రామకృష్ణ