ప్రతిపక్షాలను రెచ్చగొచ్చేలా అధికార పార్టీ నాయకులు మాట్లాడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. ఏ రాష్ట్రంలోనూ ఎన్నికల కమిషనర్‌ను ఈ విధంగా తొలగించలేదని అన్నారు. సీఎం జగన్ చెప్పినట్లు ఎన్నికలు నిర్వహిస్తే రాష్ట్రంలో కరోనా మరింత విజృంభించేదన్నారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు.. కరోనా నివారణపై దృష్టి సారిస్తే జగన్ ప్రభుత్వం మాత్రం అధికారులను ఎలా సస్పెండ్ చేయాలనే దానిపైనే దృష్టి పెట్టిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
'అధికారులను ఎలా సస్పెండ్ చేయాలనే దానిపైనే సీఎం దృష్టి' - ఎస్ఈసీ రమేశ్ కుమార్ తొలగింపు
సీఎం జగన్ చెప్పినట్లు స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే రాష్ట్రంలో కరోనా మరింత విజృంభించే పరిస్థితులు ఉండేవని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. కరోనా నియంత్రణపై చర్యలు తీసుకోకుండా.. అధికారులను ఎలా సస్పెండ్ చేయాలనే దానిపైనే సీఎం దృష్టి పెట్టారని విమర్శించారు.
cpi ramakrishna on ycp govt over ramesh kumar removed as sec