తెలుగుదేశం కార్యాలయాలపై దాడులను విపక్షాలు ముక్త కంఠంతో ఖండించాయి. విమర్శలను సహించలేని అధికార వైకాపా.. దాడులతో రెచ్చిపోతోందని నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతిపక్షాలపై దాడులు దుష్ట సంప్రదాయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. భౌతికదాడులు సమంజసం కాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు హితవు పలికారు.
తెదేపా కార్యాలయాలపై దాడుల్ని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం ఖండించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.