ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించకుండా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హడావిడిగా నోటిఫికేషన్ ఇచ్చారని అన్నారు. ఎన్నికలను నిలుపుదల చేస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పుతో రాజ్యాంగం, న్యాయస్థానం పట్ల ప్రజలకు గౌరవం పెరిగిందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ఎస్ఈసీ.. పట్టింపులకు పోకుండా కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు.
పరిషత్ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి: సీపీఐ రామకృష్ణ - mptc zptc elections in ap news
పరిషత్ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వటంపై హర్షం వ్యక్తం చేశారు.
ఏపీ పరిషత్ ఎన్నికలు