ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాజధాని బిల్లులను తిరస్కరించండి: సీపీఐ రామకృష్ణ

రాజధాని వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను తిరస్కరించమని కోరుతూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి లేఖ రాశారు. రాజధాని తరలింపు వల్ల రాష్ట్ర ఖజానాపై పెనుభారం పడుతుందన్నారు.

cpi ramakrishna letter to governer bishwabushan harichandan
గవర్నర్​కు సీపీఐ రామకృష్ణ లేఖ

By

Published : Jul 19, 2020, 10:52 AM IST

గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను తిరస్కరించమని లేఖలో కోరారు. ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఈ బిల్లులను తీసుకొచ్చిందని విమర్శించారు.

ఆనాడు అసెంబ్లీలో అమరావతి రాజధానిగా ప్రకటించగానే వైకాపాతో పాటు అన్ని పార్టీలూ హర్షించాయి. సీఎం జగన్‌ గతంలో రాజధానికి 33 వేల ఎకరాలు అవసరమున్నట్లు చెప్పారు. ఇప్పుడు రాజధాని తరలింపు వల్ల రాష్ట్ర ఖజానాపై పెనుభారం పడుతుంది. రాష్ట్ర పునర్విభజన చట్టం 2014 ప్రకారం ఈ బిల్లులు ఆమోదయోగ్యం కాదు. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను తిరస్కరించని పక్షంలో రాష్ట్రపతికి వద్దకు పంపండి- రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

ABOUT THE AUTHOR

...view details