ముఖ్యమంత్రి జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. తిరుపతి రుయాలో ఆక్సిజన్ అందక 23 మంది మరణిస్తే.. ప్రభుత్వం మాత్రం 11 మందినే గుర్తించి పరిహారం ప్రకటించిందని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆక్సిజన్ అందక 76 మంది మరణించారని సీపీఐ నేత రామకృష్ణ స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలని లేఖలో డిమాండ్ చేశారు.
సీఎం జగన్‌కు సీపీఐ రామకృష్ణ లేఖ - సీపీఐ రామకృష్ణ వార్తలు
రాష్ట్రంలో ఆక్సిజన్ అందక మరణించిన మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం జగన్‌కు లేఖ రాశారు.
సీపీఐ రామకృష్ణ