సీఎం జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. రాష్ట్రంలో ప్రాథమిక విద్యను మాతృభాషలోనే కొనసాగించాలని లేఖలో పేర్కొన్నారు. అతి ప్రాచీన భాషగా తెలుగును 2008 అక్టోబర్ 31న ప్రభుత్వం గుర్తించిందని తెలిపారు. ఆంగ్ల మాధ్యమం తప్పనిసరి జీవోలను హైకోర్టు రద్దు చేసిందని.. ఆంగ్ల మాధ్యమం మంచిదే అయినా మాతృభాషను విస్మరించరాదని తెలిపారు. ప్రాథమిక విద్యనైనా కనీసం మాతృభాషలో తప్పనిసరి చేయాలని కోరారు. ప్రభుత్వ, కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లలో ఒకే విధానం ఉండాలన్నారు. సాంకేతిక విద్యకు ప్రాధాన్యత కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
'రాష్ట్రంలో ప్రాథమిక విద్యను మాతృభాషలోనే కొనసాగించాలి' - ముఖ్యమంత్రి జగన్
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు. రాష్ట్రంలో ప్రాథమిక విద్యను మాతృభాషలోనే కొనసాగించాలని లేఖలో తెలిపారు.
rk