'ఎన్‌ఆర్‌సీ, సీఏఏలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలి' - సీఎం జగన్‌కు సీపీఐ రామకృష్ణ లేఖ
ఎన్‌ఆర్‌సీ, సీఏఏ, ఎన్‌సీఆర్‌లకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు. తెలంగాణ తరహాలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోనూ తీర్మానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పార్లమెంటులో వైకాపా ఎంపీలతో సీఏఏకు అనుకూలంగా ఓటు వేయించారని లేఖలో ప్రస్తావించారు. కేంద్రం నిర్ణయంతో ముస్లింలు, మైనారిటీ వర్గాలు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు.
సీపీఐ రామకృష్ణ