ముఖ్యమంత్రి జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. మూడు నెలలుగా చేతివృత్తిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. 23 రకాల చేతివృత్తిదారుల పరిస్థితి దయనీయంగా ఉందని తెలిపారు. కార్పొరేషన్లు, బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలను రద్దు చేయాలని కోరారు. ప్రతి వృత్తిదారునికి కనీసం రూ.2 లక్షల రుణం రాయితీపై ఇవ్వాలని లేఖలో ప్రస్తావించారు.
చేతివృత్తిదారులను ఆదుకోండి: సీపీఐ రామకృష్ణ - ఏపీ సీఎం వైఎస్ జగన్
చేతివృత్తిదారులను ఆదుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి జగన్‌కు సీపీఐ నేత రామకృష్ణ లేఖ రాశారు. ప్రతి వృత్తిదారునికి రెండు లక్షల రూపాయల రుణం రాయితీపై ఇవ్వాలని కోరారు.
cpi ramakrishna