ముఖ్యమంత్రి జగన్కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ లేఖ రాశారు. అనంతపురంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కోసం రూ.30కోట్ల గ్రాంటు విడుదల చేయాలని కోరారు. నిధులను ఇవ్వకపోవటం వల్ల ఆస్పత్రి ఏర్పాటులో జాప్యం నెలకొందని పేర్కొన్నారు. అనంతపురంలో జిల్లాలో అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయని... దీనిపై సీఎం స్పందించాలని కోరారు.
'అనంతపురం సూపర్ స్పెషాలిటీకి నిధులు విడుదల చేయండి' - అనంతపురం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి
అనంతపురంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కోసం నిధులు విడుదల చేయాలని కోరుతూ సీఎం జగన్కు సీపీఐ రామకృష్ణ లేఖ రాశారు.
!['అనంతపురం సూపర్ స్పెషాలిటీకి నిధులు విడుదల చేయండి' cpi ramakrishna letter to cm jagan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8016395-198-8016395-1594695728138.jpg)
cpi ramakrishna letter to cm jagan