ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ముందు కరోనా కట్టడిపై దృష్టి పెట్టండి: సీపీఐ రామకృష్ణ - CPI Ramakrishna comments on Jagan

మీడియా సంస్థలు, ఎంపీ రఘురామపై పెట్టిన కేసులు ఉపసంహరించాలని... సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. కక్ష సాధింపు చర్యలు మానేసి... కరోనా కట్టడిపై దృష్టి పెట్టాలన్నారు.

సీపీఐ రామకృష్ణ
సీపీఐ రామకృష్ణ

By

Published : May 16, 2021, 3:13 PM IST

సీపీఐ రామకృష్ణ ప్రకటన

రాష్ట్ర ప్రభుత్వంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శలు గుప్పించారు. ప్రజలు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోతుంటే... సీఎం జగన్ కక్ష సాధింపు చర్యలకు ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కొవిడ్-19 కట్టడికి చర్యలు తీసుకుంటుంటే... జగన్ మాత్రం గ్రామాలకు ఇంటర్నెట్, నగదు పంపిణీ అంటూ కాలయాపన చేస్తున్నారన్నారు.

గడచిన 2 వారాల వ్యవధిలోనే రాష్ట్రంలో దాదాపు 3 లక్షల కొత్త కరోనా కేసులు వెలుగుచూశాయని, ఈ పరిస్థితికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని రామకృష్ణ ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి.. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అఖిలపక్ష నాయకుల సలహాలు, సూచనలతో.. ముందుగా కరోనాను కట్టడి చేయాలని హితవు పలికారు.

ABOUT THE AUTHOR

...view details