అసెంబ్లీ సమావేశాలు మొదలైన రెండ రోజుల్లోనే... సభలో గందరగోళం జరిగిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. బడ్జెట్‌లో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి రంగాలకు నిధులు తగ్గించారని ఆరోపించారు. సాగునీరు, పరిశ్రమల రంగాలకు నిధుల్లో కోతలు విధించారని మండిపడ్డారు. అమరావతి విషయంలో సీఎం జగన్ మొండిగా వ్యవహరిస్తున్నారని... సెలెక్ట్ కమిటీకి బిల్లులు వెళ్లాక మళ్లీ సభలో ప్రవేశపెట్టడమేంటని ప్రశ్నించారు. పెట్రో, విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా ఈ నెల 20న నిరసన కార్యక్రమాలు చేపడతామని అన్నారు.
'బిల్లులు సెలెక్ట్ కమిటీకి వెళ్లాక మళ్లీ ప్రవేశపెట్టడమేంటి?'
రెండు రోజుల్లో సభలో జరిగిన గందరగోళంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. బిల్లులు సెలెక్ట్ కమిటీకి వెళ్లాక మళ్లీ సభలో ప్రవేశపెట్టడమేంటని ప్రశ్నించారు. నిధుల కేటాయింపులు సరిగ్గా లేవని ఆయన ఆరోపించారు.
అసెంబ్లీలో బడ్జెట్పే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పందన