కేంద్ర ప్రభుత్వ తీరుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్లో చట్టాలపై సరైన చర్చ లేకుండానే బిల్లులను ఆమోదింపజేసుకుంటున్నారని దుయ్యబట్టారు. ఇదే అంశంపై సాక్షాత్తు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆవేదన వ్యక్తం చేశారని గుర్తు చేశారు. విజయవాడలో మాట్లాడిన ఆయన.. ప్రతిపక్ష పార్టీలపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి ( central minister kishan reddy ) చేసిన వ్యాఖ్యలను ఖండించారు. పార్లమెంట్లో ప్రతిపక్షాల కోరిన అంశాలపై ఎందుకు చర్చ చేపట్టలేదని ప్రశ్నించారు. విభజన చట్టంలో ఒక్క హామీ కూడా అమలు చేయకుండానే.. అన్నీ చేసినట్లు కిషన్ రెడ్డి చెప్పడం సరికాదన్నారు. పార్లమెంట్ సాక్షిగా ఏపీ(andhrapradesh)కి ఇచ్చిన హామీల సంగతేంటని నిలదీశారు. ఇదే అంశంపై రాష్ట్ర భాజపా నాయకులు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. ఇప్పటికైనా రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించాలని హితవు పలికారు. మోదీ ప్రజావ్యతిరేక విధానాలపై దిల్లీలో జరిగే అఖిలపక్ష సమావేశంలో చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని చెప్పారు.
cpi ramakrishna: కిషన్ రెడ్డిగారు.. ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేశారా..?
ప్రజాఆశీర్వాద యాత్రలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ( central minister kishan reddy ) చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ (cpi ramakrishna). పార్లమెంట్లో నూతన మంత్రులను సభకు పరిచయం చేయకుండా ప్రతిపక్షాలు అడ్డుపడ్డాయని చెప్పటాన్ని తీవ్రంగా ఖండించారు. సభలో ప్రతిపక్షాల కోరిన అంశాలపై ఎందుకు చర్చ చేపట్టలేదని ప్రశ్నించారు. పార్లమెంట్ సాక్షిగా ఏపీకి ఇచ్చిన విభజన హామీల అమలు సంగతేంటని నిలదీశారు.
cpi ramakrishna fiers on kishan reddy