విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం ప్రకటన దుర్మార్గమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. జగన్‌తో సంప్రదింపులు జరిపామని నిర్మలా సీతారామన్ తెలిపారని చెప్పారు. దీన్నిబట్టి చూస్తే రాష్ట్రానికి జరిగే ద్రోహంలో జగన్‌కు కూడా పాత్ర ఉందని ఆరోపించారు. కేంద్రం వైఖరికి నిరసనగా ఏపీ భాజపా నేతలు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి పెంచాలన్నారు.
స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం ప్రకటన దుర్మార్గం: రామకృష్ణ - cpi ramakrishna on bjp
విశాఖ ఉక్కు పరిశ్రమపై కేంద్రం ప్రకటనను తీవ్రంగా ఖండించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ప్రైవేటీకరణను నిలిపివేసే దిశగా రాష్ట్రానికి చెందిన ఎంపీలు కేంద్రంపై పోరాడాలని అన్నారు.
cpi