రాజధాని అమరావతి కోసం రైతులు, మహిళలు ఎడతెగని పోరాటం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ అన్నారు. సీపీఐ కార్యాలయంలో రాజకీయ ఐకాస ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా సంఘీభావ దీక్షలో ఆయన పాల్గొన్నారు. రైతులు, మహిళల్ని జైల్లో పెట్టినా ఉద్యమం విడిచిపెట్టలేదని గుర్తు చేశారు. రాజధాని విషయంలో ప్రజాభీష్టాన్ని ముఖ్యమంత్రి జగన్ గౌరవించాలని తెలిపారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో రాజధాని కొనసాగింపుపై సీఎం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
అమరావతి కొనసాగింపుపై సీఎం ప్రకటన చేయాలి: రామకృష్ణ - ఏపీ రాజధానిగా అమరావతి
రాజధానిగా అమరావతిని కొనసాగించేలా సీఎం జగన్ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటన చేయాలని సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్ చేశారు.

cpi ramakrishna