ప్రకాశం జిల్లా కురిచేడులో మరణాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని సీపీఐ రాష్ట్ర శాఖ డిమాండ్ చేసింది. చనిపోయిన వారు నాటుసారా, శానిటైజరు, వేడి నీళ్లు కలిపి తాగినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం విధానం విఫలమైందనడానికి ఇలాంటి ఘటనలే నిదర్శనమన్నారు. మద్య నియంత్రణ పేరిట మద్యం ధరలను మూడు వందల శాతం పెంచారని... పైగా బ్రాండ్లను తీసేశారని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
కురిచేడు ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలి: సీపీఐ రామకృష్ణ - crime news in prakasham
ప్రకాశం జిల్లా కురిచేడులో మరణాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
cpi ramakrishna