స్థానిక ఎన్నికలపై హైకోర్టు చెప్పినా ప్రభుత్వం వినకపోవడం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సహకరించాలని హితవు పలికారు. మొన్నటి వరకు కరోనా అని.. ఇప్పుడు వ్యాక్సిన్ అనే సాకుతో ఎన్నికలను వాయిదా వేయాలని చూస్తున్నారని ఆరోపించారు.
ఉద్యోగ సంఘాలను రెచ్చగొట్టి కొత్త సమస్య తెస్తున్నారనివిమర్శించారు. మన రాష్ట్రంలో ఒక్క చోటే కరోనా ఉందా అని ప్రశ్నించారు. ఏకగ్రీవాల కోసం జెడ్పీటీసీ, ఎంపీటీసీ నోటిఫికేషన్లో ఎన్నో అక్రమాలు జరిగాయని అన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు మళ్లీ నోటిఫికేషన్‌ఇవ్వాలని డిమాండ్ చేశారు.