సీఎం జగన్ కర్నూలులో పర్యటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. 277 కరోనా కేసులతో కర్నూలు అల్లకల్లోలం అవుతోందన్న ఆయన... కర్నూలును కాపాడుకునేందుకు అన్ని పార్టీలు నడుం కట్టాలన్నారు. కర్నూలు కేసుల విషయంలో వివాదాస్పద అంశాలు కూడా ఉన్నాయని రామకృష్ణ అన్నారు. తక్షణమే సీఎం కర్నూలులో పర్యటించి, ప్రజలకు భరోసా కల్పించాలన్నారు.
'సీఎం జగన్... కర్నూలులో పర్యటించాలి' - ఏపీ కరోనా వార్తలు
కరోనా కేసులతో తీవ్రభయాందోళన ఉన్న కర్నూలు వాసులకు భరోనా కల్పించేందుకు సీఎం జగన్.. కర్నూలులో పర్యటించాలని సీపీఐ రామకృష్ణ కోరారు. కర్నూలును కాపాడుకునేందుకు అన్ని పార్టీలు కలిసి పోరాడాలని ఆయన సూచించారు.
cpi ramakrishna