రాష్ట్రంలో సీఎం జగన్ డేంజర్ గేమ్ ఆడుతున్నారని... ఈ ఆట చివరకు జగన్నే కాటేస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ముఖ్యమంత్రి పనితీరు, ప్రవర్తనపై రామకృష్ణ మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ సాగుతోందని... ఎలక్షన్ కమిషన్కు కూడా విలువ లేకుండా చేశారని దుయ్యబట్టారు. సుప్రీం కోర్టు మార్గ దర్శకాలను పాటించకుండా.. ఒక్క రోజులో ఎన్నికల నోటిఫికేషన్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఎస్ఈసీ ప్రభుత్వం చెప్పినట్టు పనిచేయడానికి వచ్చిందా అని నిలదీశారు. పోలీస్, వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించుకుని బెదిరింపులకు పాల్పడి దోచుకున్న సొమ్మును విచ్ఛలవిడిగా ఎన్నికల్లో పంచుతున్నారని ఆరోపించారు. వీరి ప్రవర్తిస్తున్న తీరు చూస్తే అసలు ప్రశ్నించే ప్రతిపక్షం లేకుండా చేసి రాష్ట్రాన్ని దోచుకోవడానికి వచ్చినట్టుంది తప్ప... ప్రజలకు సేవ చేసేందుకు కాదనిపిస్తోందని వ్యాఖ్యానించారు.
జగన్కు ఇంట్లోనే ప్రతిపక్షం..!