ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జగన్ మనసులో మాటే మంత్రి నాని చెప్పారు: సీపీఐ రామకృష్ణ - cpi ramakrishna news

రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనను మంత్రి కొడాలి నాని బయటపెట్టారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు. అమరావతి రాజధాని ప్రాంతాన్ని నిర్వీర్యం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు.

cpi-ramakrishna
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ

By

Published : Sep 8, 2020, 1:18 PM IST

అమరావతి రాజధాని విషయంలో మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. రాజధానిపై ప్రభుత్వ దుష్ట ఆలోచన, కుట్ర... కొడాలి నాని ద్వారా బయటకు వచ్చిందన్నారు. సంవత్సరం నుంచి మూడు రాజధానుల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని రామకృష్ణ ఆరోపించారు. అమరావతిలో శాసన రాజధాని కూడా వద్దని మంత్రి కొడాలి నాని చెప్పటం దుర్మార్గమన్నారు. జగన్ మనసులోని మాటనే మంత్రి కొడాలి నాని చెప్పారని రామకృష్ణ అభిప్రాయపడ్డారు. తమను ఎన్నుకున్న ప్రజల దగ్గరకే వైకాపా నేతలు వెళ్లలేని పరిస్థితి నెలకొందని తెలిపారు. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి తీరు ఏ మాత్రం మారడం లేదని.... అమరావతినే రాజధానిగా కొనసాగే వరకు పోరాటం చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి తేల్చి చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details