ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అమరావతినే రాజధానిగా అసెంబ్లీలో ప్రకటించాలి: సీపీఐ రామకృష్ణ - సీపీఐ రామకృష్ణ తాజా వార్తలు

రాజధాని విషయంలో హైకోర్టు తీర్పును గౌరవించి అమరావతే రాజధానిగా అసెంబ్లీలో ప్రకటించాలి సీపీఐ రామకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సీఎం జగన్​కు లేఖ రాసిన ఆయన.. రాజధాని అంశంలో వివాదాలకు స్వస్తి పలకాలన్నారు.

సీపీఐ రామకృష్ణ
సీపీఐ రామకృష్ణ

By

Published : Mar 6, 2022, 5:00 PM IST

రాజధాని విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించి.. అమరావతినే రాజధానిగా కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్​కు ఆయన లేఖ రాశారు.

అమరావతి అంశంతో పాటు వెనుకబడిన రాయలసీమ, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల సమగ్ర అభివృద్ధిపై.. రేపటి నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలన్నారు. న్యాయ వ్యవస్థకు, శాసన వ్యవస్థకు మధ్య తగాదా పెట్టే విధంగా రాష్ట్ర మంత్రులు వ్యాఖ్యానించటం తగదని ఆయన హితవు పలికారు.

ABOUT THE AUTHOR

...view details