తెలుగు ప్రజల ఆకాంక్ష అయిన అమరావతిని రాజధానిగా కొనసాగించి తీరాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పష్టం చేశారు. రాజధాని ఉద్యమాన్ని అణిచేందుకు జగన్ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించినా.. 500రోజుల పాటు కొనసాగించారని కొనియాడారు. ప్రజల మద్దతుతోనే అమరావతి ఉద్యమకారులు ముందుకు సాగారని తెలిపారు.
'అమరావతి అభివృద్ధిలో కేంద్రానికి బాధ్యత ఉంది' - సీపీఐ రామకృష్ణ తాజా సమాచారం
రాజధాని ఉద్యమం 500వ రోజుకు చేరుకున్న సందర్భంగా.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పందించారు. అమరావతిని రాజధానిగా కొనసాగించి తీరాలని ఆయన డిమాండ్ చేశారు.
cpi Ramakrishna
అమరావతి ఉద్యమానికి భాజపా రాష్ట్ర పార్టీ మద్దతు తెలిపితే సరిపోదని.., కేంద్రం నుంచి స్పష్టత ఇప్పించాలని డిమాండ్ చేశారు. స్వయంగా ప్రధాని శంకుస్థాపన చేసినందున అమరావతి అభివృద్ధికి కేంద్రం బాధ్యత కూడా ఎంతో ఉందన్నారు.
ఇదీ చదవండి:'వారి పోరాటం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినది'