రాజధానుల ఏర్పాటుపై ఇద్దరే నిర్ణయాలు తీసుకుంటే కమిటీలు వేయడమెందుకని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 27న జరిగే కేబినెట్లో చర్చిస్తామని చెప్పి.. భేటీకి ముందుగానే ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖపై మాట్లాడారన్నారు. రాజధాని ఏర్పాటుపై హైపవర్ కమిటీ అవసరం లేదని.. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు. తక్షణమే ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని.. సమగ్రాభివృద్ధి, ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధిపై అఖిలపక్షం వేయాలని రామకృష్ణ అన్నారు.
ఇద్దరే నిర్ణయాలు తీసుకుంటే కమిటీలెందుకు?: సీపీఐ రామకృష్ణ - అమరావతిపై సీపీఐ రామకృష్ణ వ్యాఖ్యలు న్యూస్
ఎవరిని మభ్యపెట్టేందుకు హైపవర్ కమిటీలు వేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నిపుణుల కమిటీ నివేదిక రాకముందే 3 రాజధానులపై వ్యాఖ్య చేశారని పేర్కొన్నారు.
![ఇద్దరే నిర్ణయాలు తీసుకుంటే కమిటీలెందుకు?: సీపీఐ రామకృష్ణ cpi ramakrishna about capital amaravathi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5532907-907-5532907-1577630881022.jpg)
cpi ramakrishna about capital amaravathi