ముఖ్యమంత్రి జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. కరోనా విస్తరిస్తున్న దృష్ట్యా మద్యం అమ్మకాలపై పునరాలోచించాలని సూచించారు. మద్యం దుకాణాల వద్ద లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని.. వ్యక్తిగత దూరం, మాస్కులు లేకుండా బారులుతీరి లైన్లలో నిల్చున్నారని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పణంగా పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘సీఎం గారూ.. మద్యం అమ్మకాలపై పునరాలోచించండి' - మద్యం అమ్మకాలపై సీపీఐ రామకృష్ణ
కరోనా విస్తరిస్తున్న వేళ.. మద్యం అమ్మకాలపై పునరాలోచించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ .. సీఎం జగన్‌కు లేఖ రాశారు. మద్యం దుకాణాల ఎదుట లాక్‌డౌన్ నిబంధనలు పాటించకుండా నిలబడుతున్నారని విచారం వ్యక్తం చేశారు.
సీఎం జగన్ కు సీపీఐ రామకృష్ణ లేఖ
కేంద్రం బుక్‌స్టాల్స్‌కు అనుమతులిచ్చిందని.. రాష్ట్రప్రభుత్వం మాత్రం బుక్‌స్టాల్స్‌కు అనుమతి ఇవ్వలేదని సీపీఐ నేత రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు. పోలీసుల బందోబస్తు మధ్య మద్యం అమ్మకాలు సాగించాల్సిన దుస్థితి నెలకొనడం విచారకరమన్నారు.
ఇదీ చదవండి...రాష్ట్రంలో మద్యం విక్రయాల తొలిరోజు ఆదాయమెంతంటే..?