కరోనా కష్టకాలంలో విద్యుత్ బిల్లులను మాఫీ చేయాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ సీఎం జగన్మోహన్రెడ్డికి లేఖ రాశారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని సీఎం హామీ ఇచ్చారని ఆ లేఖలో పేర్కొన్నారు. లాక్‌డౌన్ కాలంలో కొత్త టారీఫ్ ప్రకారం బిల్లులు వేయడం సరికాదని విచారం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పట్ల పోరాడే వారిపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరోనా కాలంలో విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలి’ - లాక్ డౌన్ లో కరెంట్ బిల్లులపై సీపీఐ
విద్యుత్ బిల్లుల పెంపుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ సీఎంకు లేఖ రాశారు. కరోనా కష్టకాలంలో విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలని కోరారు.
కరెంట్ బిల్లులపై సీపీఐ రామకృష్ణ