కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్లకు కొమ్ముకాసేలా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. భాజపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి సంవత్సరం బడ్జెట్లో కార్పొరేట్ అనుకూల విధానాలు కొనసాగుతున్నాయన్నారు. బడ్జెట్ వల్ల సామాన్యులకు ఒరిగిందేమీ లేదని దుయ్యబట్టారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుదల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి పేద,సామాన్య మధ్యతరగతి వర్గాలపై పెనుభారం పడుతుందన్నారు.
'బడ్జెట్ కార్పొరేట్లకు కొమ్ముకాసేలా ఉంది' - బడ్జెట్ 2021
కేంద్ర బడ్జెట్ వల్ల సామాన్యులకు ఒరిగిందేమి లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. బడ్జెట్ కార్పొరేట్లకు కొమ్ముకాసేలా ఉందని ఆరోపించారు.
cpi rama krishna on central budjet
ఎన్నికలు జరిగే తమిళనాడు, అసాం, పశ్చిమ బంగా రాష్ట్రాలకు మాత్రమే ప్రాధాన్యతనిచ్చారని రామకృష్ణ అన్నారు. ఏపీకి ప్రతి బడ్జెట్లో అన్యాయం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొవిడ్-19 క్లిష్ట పరిస్థితుల్ని కేంద్రం తనకు అనుకూలంగా మలుచుకుని.. ప్రజావ్యతిరేక చట్టాలను తీసుకొచ్చిందని ఆరోపించారు. భాజపా ప్రభుత్వానికి ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
ఇదీ చదవండి:కేంద్రం బడ్జెట్‌లో రాష్ట్రానికి మొండిచేయి : తెదేపా ఎంపీలు