ఓ పథకం ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైకాపా ప్రతిపక్షాలను బెదిరిస్తోందని సీపీఐ నేత రామకృష్ణ ఆరోపించారు. మాచర్లలో హత్యాయత్నం చేసిన వ్యక్తికి పోలీసులు.. స్టేషన్ బెయిల్ ఇచ్చి ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారని ప్రశ్నించారు. చివరకు ఉన్నత న్యాయస్థానం సైతం పోలీసుల తీరుపై డీజీపీని ప్రశ్నించే పరిస్థితులున్నాయని ఆక్షేపించారు. ఎన్నికలు నిర్వహించే బదులు పదవులను నామినేట్ చేసుకోవాల్సిందని సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును సీపీఐ నేతలు ఎన్టీఆర్ భవన్‌లో కలిశారు.
ఎన్నికల బదులు.. పదవులు నామినేట్ చేసుకోవాల్సింది: సీపీఐ - cpi on local body elections
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైకాపా ప్రతిపక్షాలను బెదిరిస్తోందని సీపీఐ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు నిర్వహించే బదులు పదవులు నామినేట్ చేసుకోవాల్సిందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ దుర్మార్గాలను అడ్డుకునేందుకు పోరాడతామన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలపై సీపీఐ వ్యాఖ్య