ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అమరావతికి సంపూర్ణ మద్దతిస్తాం: సీపీఐ నారాయణ - సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వార్తలు

అమరావతినే రాజధాని కొనసాగించాలని చేసే పోరాటానికి తమ మద్దతు ఉంటుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పష్టం చేశారు. జీవిత ఖైదీలకు క్షమాభిక్ష పెట్టాలని తెలంగాణ ప్రభుత్వానికి నారాయణ విజ్ఞప్తి చేశారు.

cpi-national-secretery-narayana-request-to-government-release-prisoners
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

By

Published : Jul 4, 2020, 3:40 PM IST

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

అమరావతి రాజధానిగా కొనసాగించాలని.... 200 రోజులుగా జరుగుతున్న పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పష్టం చేశారు. రాజధాని కోసం భూములిచ్చిన 29 గ్రామాల ప్రజలను వైకాపా ప్రభుత్వం ఎన్నో విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తోందని నారాయణ ఆరోపించారు.

జైళ్లలో మగ్గుతున్న జీవిత ఖైదీలకు క్షమాభిక్ష పెట్టాలని తెలంగాణ ప్రభుత్వానికి నారాయణ విజ్ఞప్తి చేశారు. వేల సంఖ్యలో ఖైదీలు జైళ్లల్లో ఉండిపోయారని... అక్కడ కరోనా వ్యాప్తికి ఎక్కువ అవకాశాలుంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఇంత వరకు ఖైదీలకు క్షమాభిక్ష పెట్టలేదని గుర్తు చేశారు.

ఇదీ చూడండి:బుద్ధుని బోధనలు సర్వదా అనుసరణీయం: మోదీ

ABOUT THE AUTHOR

...view details