ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'మోదీతో పాటు పెట్రోల్​, డీజిల్​ ఫొటోలనూ అంతరిక్షంలోకి పంపాలి'

రాకెట్ వేగంతో పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ఫొటోలను అంతరిక్షంలోకి పంపాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ..కేంద్రంపై వ్యంగ్యస్త్రాలు సంధించారు. పీవీ నరసింహారావు కుమార్తెను పట్టభద్రుల స్థానానికి తెరాస అభ్యర్థిగా ప్రకటించడం పెద్ద నాటకమని ఆయన తెలిపారు. తెలంగాణ రాజకీయాల్లోకి షర్మిల రాక పట్ల పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.

cpi state committee meeting
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

By

Published : Feb 22, 2021, 8:30 PM IST

పెరుగుతున్న ఇంధన ధరలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. ప్రధాని మోదీ చిత్రపటంతో పాటు పెట్రోలు, డీజిల్ ఫొటోలనూ అంతరిక్షంలోకి పంపాలని ఎద్దేవా చేశారు. ఇంధన ధరల పేరిట సామాన్యుల జేబులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొల్లగొడుతున్నాయని విమర్శించారు.

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

పీవీ నరసింహరావు కుమార్తె వాణీదేవిని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తెరాస ప్రకటించడం పెద్ద నాటకమన్నారు. తెలంగాణ రాజకీయాల్లోకి వైఎస్​ షర్మిల రావడం పట్ల పెద్దగా భయపడాల్సిన పనిలేదని నారాయణ అభిప్రాయపడ్డారు. వరవరరావుకు బెయిల్ మంజూరవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details