సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని మగ్దూమ్ భవన్‌లో జరుగుతున్న సీపీఐ జాతీయ సమితి సమావేశాలకు ఆయన హాజరయ్యారు. ఈ క్రమంలో అస్వస్థతకు గురైన రాజాను.. చికిత్స నిమిత్తం కామినేని ఆస్పత్రికి తరలించారు.
బీపీ తగ్గిపోవడం వల్లే డి.రాజా అస్వస్థతకు గురైనట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని సీపీఐ నేతలు వెల్లడించారు.