'ఒక తప్పును కప్పిపుచ్చుకునేందుకు వంద తప్పులు చేస్తున్నారు' - అమరావతిపై సీపీఐ నారాయణ కామెంట్స్
ఏపీకీ 3 రాజధానులు చేయాల్సిన అవసరం ఏం వచ్చిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. 3 రాజధానుల శంకుస్థాపనకు ప్రధానిని ఆహ్వానించాలని ఏపీ ప్రభుత్వం ఉవ్విళ్లూరుతుందన్నారు. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదే అమరావతికి పునాదిరాయి వేశాడని... ఇప్పుడు 3 రాజధానులకు ఎలా శంకుస్థాపన చేస్తారనుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు. ఒక తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఏపీ ప్రభుత్వం వంద తప్పులు చేస్తోందని మండిపడ్డారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ