CPI NARAYANA: తెలుగు చిత్ర పరిశ్రమకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య నెలకొన్న వివాదంలో ముఖ్యమంత్రి జగన్ ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.సినిమా రంగం సంక్షోభానికి సంబంధించి అనేక రకరకాల చర్చలు జరుగుతున్నాయన్న ఆయన... సినీ పరిశ్రమకు, ప్రభుత్వానికి సంబంధించిన వివాదం పరిష్కారం అవ్వాలంటే సినీ అసోసియేషన్ నేతలను ఆహ్వానించి వారితో చర్చించి సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు. ఒక వైపు మంత్రులు, ఎమ్మెల్యేలు సినీ నటులను తిడుతుంటే మరో వైపు ముఖ్యమంత్రి.. చిరంజీవితో చర్చలు జరపుతున్నారని తెలిపారు. సంస్థకు సంబంధంలేని వ్యక్తులతో చర్చించడం ద్వారా సమస్య పరిష్కారం అవుతుందా అని సీపీఐ నారాయణ ప్రశ్నించారు.
CINEMA ISSUE: చిత్ర పరిశ్రమ సమస్యపై జగన్‌ది ఏకపక్ష ధోరణి: సీపీఐ నారాయణ - cpi narayana latest updates
CPI NARAYANA: సినిమా రంగం సంక్షోభానికి సంబంధించి అనేక రకరకాల చర్చలు జరుగుతున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. సినీ పరిశ్రమకు, ప్రభుత్వానికి సంబంధించిన వివాదం పరిష్కారం అవ్వాలంటే సినీ అసోసియేషన్ నేతలను ఆహ్వానించి వారితో చర్చించి సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు.
చిత్ర పరిశ్రమ సమస్యపై జగన్‌ది ఏకపక్ష ధరణి