రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె.నారాయణ స్వాగతించారు. నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ తొలగింపునకు రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించిందన్నారు.
'శిశుపాలుడిలా తప్పులు చేస్తూనే ఉన్నారు' - నిమ్మగడ్డ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ తొలగింపుపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని సీపీఐ నేత నారాయణ అన్నారు. నిమ్మగడ్డ వ్యవహారంలో ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించిందని ఆయన ఆరోపించారు.
సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె.నారాయణ
న్యాయస్థానం తీర్పుతో ప్రభుత్వం చేసిన తప్పిదం మరోసారి బయటపడిందని నారాయణ అన్నారు. శిశుపాలుడిలా ముఖ్యమంత్రి తప్పులు చేస్తూ వెళ్తున్నారని ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి :'ఎస్ఈసీ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తాం'