జగన్ దృష్టిలో విజయవాడ.. రాజధాని ప్రాంతం కాదేమో కానీ తమ దృష్టిలో రాజధాని విజయవాడ ప్రాంతమేనని.. ఇక్కడి నుంచే ఓటర్లు వైకాపాకు బుద్ధి చెప్పాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పిలుపునిచ్చారు. విజయవాడ దాసరి భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైకాపా ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు ,రాజన్న పాలనపై నమ్మకమే ఉంటే ఎన్నికల్లో దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ప్రశ్నించారు. నమ్మకం లేకనే అప్రజాస్వామికంగా ఏకగ్రీవాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో మార్పు రావాలని.. అందుకు రాజకీయ చైతన్యం కలిగిన విజయవాడ నాంది కావాలని వ్యాఖ్యానించారు. నగరపాలక సంస్థ ఎన్నికల్లో తెదేపాతో కలిసి పోటీ చేస్తున్నామని.. తప్పకుండా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
గెలుపు పై నమ్మకమే ఉంటే దౌర్జన్యాలు ఎందుకు..? సీపీఐ నారాయణ - ap muncipal elections 2021 latest updates
గెలుపు పై వైకాపా ప్రభుత్వానికి నమ్మకమే ఉంటే మున్సిపల్ ఎన్నికల్లో దౌర్జన్యాలకు ఎందుకు పాల్పడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. విజయవాడలో మాట్లాడిన ఆయన.. నగరపాలక సంస్థ ఎన్నికల్లో తెదేపాతో కలిసి పోటీ చేస్తున్నామని.. తప్పకుండా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఏపీ మున్సిపల్ ఎన్నికలు 2021