ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆంధ్రప్రదేశ్​కు భాజపా శత్రువుగా మారింది:  నారాయణ - భాజపాపై సీపీఐ నారాయణ విమర్శల వార్తలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భాజపా శత్రువుగా మారిందని సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ రాజధానికి సాయం చేస్తానని హమీ ఇచ్చారని గుర్తుచేశారు.

cpi narayana criticises bjp about amaravathi
సీపీఐ నారాయణ

By

Published : Aug 6, 2020, 8:06 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భాజపా శత్రువుగా మారిందని సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వంతోపాటు గవర్నర్ ద్వారా సీఎం జగన్మోహన్ రెడ్డి అమరావతిని నాశనం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఏపీ గవర్నర్ రాంలాల్‌ మాదిరిగా మారిపోయాడని ఆరోపించారు. రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం నిధులు మంజూరు చేసిందని... ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ రాజధానికి సాయం చేస్తానని హమీ ఇచ్చారని గుర్తుచేశారు. చంద్రబాబు భాజపాను నమ్మి గతంలో తప్పు చేశారని... ఇప్పుడు కూడా అదే తప్పు చేస్తున్నారని నారాయణ అభిప్రాయపడ్డారు.

'భాజపా ఆంధ్రప్రదేశ్​కు శత్రువుగా మారింది. అమరావతి దిల్లీలాగా అభివృద్ధి చెందాలని ఆనాడు ప్రధాని మోదీ అన్నారు. శంకుస్థాపన చేశారు. ఆయన్ని నమ్ముకుని చంద్రబాబు రైతుల వద్ద వేల ఎకరాలు సేకరించారు. ఇప్పుడు సీఎం జగన్ భాజపా సహకారంతోనే మూడు రాజధానులంటూ నిర్ణయం తీసుకున్నారు.' -- సీపీఐ నారాయణ

ABOUT THE AUTHOR

...view details