ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఎం తప్పును కప్పిపుచ్చుకోవడానికి మంత్రులకు శిక్షా..? - ఎల్జీ పాలిమర్స్‌ వార్తలు

ముఖ్యమంత్రి తప్పును కప్పిపుచ్చుకోవడానికి మంత్రులకు శిక్ష విధిస్తున్నారని సీపీఐ జాతీయ కార్మదర్శి నారాయణ ఆరోపించారు.

cpi narayana
cpi narayana

By

Published : May 14, 2020, 4:08 PM IST

విశాఖ ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్‌ లీకేజీ ఘటనలో 12 మంది చనిపోయి.. వందల మంది క్షతగాత్రులైతే ముఖ్యమంత్రి తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి మంత్రులకు శిక్ష వేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. సీఎం జగన్ కు చిత్తశుద్ధి ఉంటే మంత్రులకు బదులు.. పరిశ్రమ ఛైర్మన్‌, ఎండీ భార్యబిడ్డలతో అక్కడ కాపురం పెట్టించాలన్నారు. అప్పుడే ప్రజలు పడుతున్న బాధలు అర్థమవుతాయని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. లాక్‌డౌన్‌ సమయంలో అసలు కంపెనీని తెరవడమే సరైన నిర్ణయం కాదని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details