రాజ్యసభ సభ్యుల విషయంలో సీఎం జగన్ రాజద్రోహానికి పాల్పడ్డారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని రిలయన్స్ వాళ్లే చంపించారని ముఖ్యమంత్రి జగన్ గతంలో స్వయంగా ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి నాడు రిలయన్స్‌కు వ్యతిరేకంగా పోరాటం చేశారన్నారు. జగన్ తన నాన్నను చంపిన వ్యక్తులతో సంబంధం ఉన్న వారికి సీటు ఇస్తారా.. అని ప్రశ్నించారు. అలా చేస్తే జగన్ తన తండ్రికి ద్రోహం చేసినట్టు కాదా అని నిలదీశారు. హైదరాబాద్‌లోని ముగ్దూంభవన్లో మాట్లాడిన ఆయన.. స్థానిక సంస్థల ఎన్నికల్లో సీఎం జగన్ బెదిరింపులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఏపీ ఎన్నికల్లో ధనం, మద్యం ఏరులై పారుతుందన్నారు. ఎన్ఆర్సీ, ఎన్పీఆర్, సీఏఏపై 23 వరకు ప్రజలను చైతన్య పరిచే కార్యక్రమాలు చేపడతామని వివరించారు.
'నాన్నను చంపారని ఆరోపణలు చేసి వారికే సీటు ఎలా ఇచ్చారు' - సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వార్తలు
వైఎస్ రాజశేఖరరెడ్డిని రిలయన్స్ వాళ్లే చంపించారని ముఖ్యమంత్రి జగన్ గతంలో చెప్పినట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ గుర్తు చేశారు. తన తండ్రిని చంపిన వ్యక్తులతో సంబంధం ఉన్న వారికి సీటు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.
!['నాన్నను చంపారని ఆరోపణలు చేసి వారికే సీటు ఎలా ఇచ్చారు' cpi-narayana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6361237-thumbnail-3x2-cpi.jpg)
cpi-narayana
'నాన్నను చంపారని ఆరోపణలు చేసి వారికే సీటు ఎలా ఇచ్చారు'