ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

BIG BOSS: 'బిగ్ బాస్ షోతో యువతకు ఏం సందేశం ఇస్తున్నారు' - bigg boss latest updates

బిగ్ బాస్ షోపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. కేవలం సంపాదన కోసం ఈ షో నిర్వహించటం అనైతికమన్నారు. సంస్కృతిని అమ్మేసుకుంటూ.. డబ్బు సంపాదన అవసరమా అని బిగ్ బాస్ షో ప్రదర్శన నిర్వాహకులను నారాయణ ప్రశ్నించారు.

cpi narayana comments on big boss show
cpi narayana comments on big boss show

By

Published : Sep 15, 2021, 4:29 PM IST

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

బిగ్ బాస్ షో ప్రదర్శన వల్ల యువతకు, సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. మన సంస్కృతి, సంప్రదాయాలను పూర్తి విరుద్ధంగా.. కేవలం సంపాదన కోసం ఈ షో నిర్వహించటం అనైతికమన్నారు. సంస్కృతిని అమ్మేసుకుంటూ.. డబ్బు సంపాదన అవసరమా అని బిగ్ బాస్ షో ప్రదర్శన నిర్వాహకులను నారాయణ ప్రశ్నించారు. ఆ షోలో ఉండే యువతి, యువకులు 24 గంటలు ఏమి చేస్తున్నారో తెలీదని.. లోపల అసాంఘిక కార్యకలాపాలు జరుతున్నాయని తనకు అనుమానంగా ఉందన్నారు.

ABOUT THE AUTHOR

...view details