'ప్రత్యేక శాసనసభ సమావేశాలను అడ్డుకోండి' - సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
రాష్ట్రంలో అతి పెద్ద పండుగ సంక్రాంతి రోజున రైతులను ఇబ్బందికి గురి చేసిన ముఖ్యమంత్రిగా.. జగన్ చరిత్రలో నిలిచిపోతారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఎద్దేవా చేశారు. అమరావతిలో రైతులకు మద్దతుగా దీక్షలో పాల్గొన్నారు. మరో రెండు రోజుల్లో జరిగే.. ప్రత్యేక శాసనసభ సమావేశాలను రైతులంతా కలిసి అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. పోలీసుల సహాయం లేకుండా ముఖ్యమంత్రి జగన్ తన నివాసం నుంచి రాజధానికి చేరుకోలేకపోతున్నారని అన్నారు. కృష్ణాయపాలెంలో రాజధాని కోసం ప్రాణాలర్పించిన రైతు కృపాదానం కుటుంబ సభ్యులను పరామర్శించారు.
cpi-narayan-in-amaravathi