పేదలకు స్థలాలు, జగనన్న ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు తీర్పుపై సీపీఐ నేత రామకృష్ణ స్పందించారు. ధర్మాసనం ఇచ్చిన తీర్పు హర్షణీయమని పేర్కొన్నారు. సెంటు స్థలంలో ఇంటి నిర్మాణం ఎలా సాధ్యమవుతుందని హైకోర్టు వ్యాఖ్యానించినట్లు తెలిపారు. పట్టణాల్లో 2, గ్రామాల్లో 3 సెంట్ల చొప్పున కేటాయించాలని ముందే చెప్పామని రామకృష్ణ వెల్లడించారు. ప్రభుత్వం ఇచ్చే లక్షా 80 వేలు ఏ మాత్రం సరిపోవని... అందువల్ల రాష్ట్ర ప్రభుత్వమే నివాసయోగ్యమైన ఇళ్లు నిర్మించి ఇవ్వాలని స్పష్టం చేశారు.
CPI LEADER RAMAKRISHNA: 'జగనన్న ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు తీర్పు హర్షణీయం' - ap latest news
పేదలకు స్థలాలు, ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయమని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. ప్రభుత్వమిచ్చే డబ్బు నిర్మాణానికి సరిపోదని... అందువల్లే సర్కారే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
'జగనన్న ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు తీర్పు హర్షణీయం'