ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ప్రజా సమస్యల పరిష్కారానికి మే 4న మౌనదీక్ష' - cpi mouna deeksha news

లాక్​డౌన్​తో పేదలు, కూలీలు, వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం మే 4న రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ ఆధ్వర్యంలో మౌనదీక్షలు చేపడుతున్నట్లు వెల్లడించారు. పేదలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్​ చేశారు.

'ప్రజా సమస్యల పరిష్కారానికి మే 4న మౌనదీక్ష'
'ప్రజా సమస్యల పరిష్కారానికి మే 4న మౌనదీక్ష'

By

Published : Apr 30, 2020, 4:44 PM IST

Updated : Apr 30, 2020, 4:56 PM IST

ప్రజాసమస్యల పరిష్కారం కోసం మే 4న రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ ఆధ్వర్యంలో మౌనదీక్షలు చేపట్టనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. లాక్​డౌన్​తో పేదలు, కూలీలు, కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పేదలకు సహాయం అందించాలని ఆయన డిమాండ్​ చేశారు. అలాగే లాక్​డౌన్​ వల్ల నష్టపోయిన రైతులు, చిరువ్యాపారులు, చిన్న తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. వలస కార్మికులను వారి స్వస్థలాలకు చేర్చాలన్న ఆయన.. ప్రతి పేద కుటుంబానికి రూ.10 వేలు ఆర్థిక సహాయం, 50 కిలోల బియ్యం, 50 కిలోల గోధుమలు అందించాలని కోరారు.

Last Updated : Apr 30, 2020, 4:56 PM IST

ABOUT THE AUTHOR

...view details