ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో కేంద్రం కల్పించుకొని సమస్య పరిష్కరించాలని సీపీఐ జాతీయ నేత డి.రాజా కోరారు. పార్లమెంటులో పునర్విభజన బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంలో ఏపీకి ప్రతేక హోదా ఇవ్వాలని సీపీఐ డిమాండ్ చేసిందని గుర్తుచేశారు. అమరావతికి తమ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
అమరావతి విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలి: డి.రాజా
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంపై కేంద్రం జోక్యం చేసుకోవాలని సీపీఐ జాతీయ నేత డి.రాజా అన్నారు. అమరావతి రైతుల ఆందోళన 200 రోజులకు చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. అమరావతి ఉద్యమానికి సీపీఐ పూర్తి మద్దతు ఇస్తుందని రాజా స్పష్టం చేశారు. ప్రజల అభిష్టానికి అనుగుణంగా రాజధాని అమరావతిలోనే కొనసాగాలని అభిప్రాయపడ్డారు.
డి.రాజా
ఆంధ్రప్రదేశ్లోని ప్రజానీకం, అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర రాజధాని గుంటూరు, కృష్ణా జిల్లాల మధ్యలో ఉండాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ అర్థం చేసుకోవాలని హితవు పలికారు. ఒక యువ ముఖ్యమంత్రిగా జగన్ సహృద్భావంతో ఉండాలి గానీ సంకుచిత మనస్తత్వంతో ఉండరాదని డి.రాజా సూచించారు.
ఇదీ చదవండి :రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు: కన్నా లక్ష్మీనారాయణ